Ganta Srinivasarao: చంద్రబాబుతో మాజీ మంత్రి గంటా భేటీ

వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న పలువురు నాయకులు తెదేపా అధినేత చంద్రబాబును బుధవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు.

Updated : 14 Mar 2024 07:40 IST

నారాయణ, వైయస్‌ఆర్‌ జిల్లా  నేతలు కూడా..

ఈనాడు, అమరావతి: వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న పలువురు నాయకులు తెదేపా అధినేత చంద్రబాబును బుధవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి.నారాయణ బుధవారం ఉదయం చంద్రబాబుతో భేటీ అయ్యారు. గంటాను విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నుంచి పోటీ చేయించే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు అదే విషయాన్ని మరోసారి ఆయనకు చెప్పినట్లు తెలిసింది. దానిపై గంటా తన నిర్ణయం వెల్లడించలేదని సమాచారం. వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన పలువురు నాయకులు బుధవారం సాయంత్రం చంద్రబాబును కలిశారు. వారిలో కడప లోక్‌సభ టికెట్‌ ఆశిస్తున్న పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాస్‌రెడ్డి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఇన్‌ఛార్జులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, భూపేష్‌రెడ్డి, బద్వేల్‌ నియోజకవర్గానికి చెందిన నాయకుడు రితీష్‌రెడ్డి తదితరులున్నారు. పొత్తులో భాగంగా బద్వేలు, జమ్మలమడుగు భాజపాకు వెళతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆ రెండు నియోజకవర్గాలకు చెందిన తెదేపా నాయకులు చంద్రబాబును కలిశారు. ఒకే లోక్‌సభ స్థానం పరిధిలోని రెండు అసెంబ్లీ సీట్లను భాజపాకు ఇవ్వాలనుకోవడంపై పునరాలోచించాలని, పైగా ఆ రెండుచోట్లా తెదేపా బలంగా ఉందని వారు అధినేత దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. ప్రొద్దుటూరు టికెట్‌ తనకే ఇవ్వాలని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కోరినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని