Mallareddy: రేవంత్‌రెడ్డి సీఎం అవుతారని మొదట చెప్పింది నేనే: మల్లారెడ్డి

రేవంత్‌రెడ్డి సీఎం అవుతారని మొదట చెప్పింది తానేనని మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి పేర్కొన్నారు. 2014లో బొల్లారంలోని తోట ముత్యాలమ్మ దేవాలయంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న ఇచ్చిన విందుకు హాజరైన సందర్భంలో తాను స్వయంగా రేవంత్‌రెడ్డితో ఈ విషయం చెప్పినట్లు ఆయన తెలిపారు.

Updated : 17 Mar 2024 06:42 IST

కార్ఖానా, న్యూస్‌టుడే.. రేవంత్‌రెడ్డి సీఎం అవుతారని మొదట చెప్పింది తానేనని మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి పేర్కొన్నారు. 2014లో బొల్లారంలోని తోట ముత్యాలమ్మ దేవాలయంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న ఇచ్చిన విందుకు హాజరైన సందర్భంలో తాను స్వయంగా రేవంత్‌రెడ్డితో ఈ విషయం చెప్పినట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను కంటోన్మెంట్‌ జయానగర్‌ కాలనీలోని తన కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు.  ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. తాను వేరే పార్టీలో చేరేది లేదన్నారు. గతంలో రేవంత్‌రెడ్డిపై తొడగొట్టి చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయపరంగానే చేసినవేనని.. వ్యక్తిగతంగా కాదన్నారు. తామంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎంతో స్నేహంగా మెలిగేవారమన్నారు. తన కుమారుడు భద్రారెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడని, అతను ఏ పార్టీ నుంచి పోటీ చేసినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని