నాడు హిమాచల్‌ను వద్దనుకున్న కంగన!

హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ అభ్యర్థిగా బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను భాజపా ప్రకటించిన వేళ గతంలో ఆమె హిమాచల్‌ నుంచి పోటీకి విముఖత వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

Updated : 26 Mar 2024 06:19 IST

దిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ అభ్యర్థిగా బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను భాజపా ప్రకటించిన వేళ గతంలో ఆమె హిమాచల్‌ నుంచి పోటీకి విముఖత వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. రాజకీయాల్లోకి ప్రవేశం గురించి కంగన ప్రస్తావిస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తే హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి కాకుండా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే మరేదైనా ప్రముఖ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ఉందని చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అయితే ఆమె తన సొంత రాష్ట్రం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తుండంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు. ‘నా ప్రియమైన భారత దేశ ప్రజల సొంత పార్టీ భాజపాకు ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది. నా సొంత రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గ అభ్యర్థిగా భాజపా నా పేరు ప్రకటించింది. ఎన్నికల్లో పోటీ విషయంలో హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. అధికారికంగా భాజపాలో చేరడం గౌరవంగా భావిస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని