ఫోన్‌ ట్యాపింగ్‌పై నిష్పాక్షిక విచారణ చేపట్టాలి

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిష్పాక్షికంగా విచారణ చేపట్టాలని మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు రాష్ట్ర డీజీపీని కోరారు.

Published : 28 Mar 2024 03:35 IST

డీజీపీకి మెదక్‌ భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు వినతి

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిష్పాక్షికంగా విచారణ చేపట్టాలని మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు రాష్ట్ర డీజీపీని కోరారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ జిల్లా మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌లపై కేసులు నమోదు చేయాలని కోరుతూ ఆయన బుధవారం డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రణీత్‌రావు స్వయంగా దుబ్బాక ఉప ఎన్నిక, హుజూరాబాద్‌, మునుగోడు ఎన్నికల సందర్భంలో ప్రతిపక్ష నాయకుడైన రఘునందన్‌రావుతో పాటు ఇతర నాయకుల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లుగా పోలీసు ఉన్నతాధికారుల ముందు అంగీకరించాడు’’ అని పేర్కొన్నారు. అప్పుడు దుబ్బాక ఎన్నికల ఇన్‌ఛార్జిగా మాజీ మంత్రి హరీశ్‌రావు ఉన్నారని రఘునందన్‌రావు గుర్తుచేశారు. ఈ మేరకు ఈ కేసులో కేసీఆర్‌, హరీశ్‌రావులతో పాటు సంతోష్‌కుమార్‌, వెంకట్రామిరెడ్డిలను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి విచారణ చేపట్టాలని డీజీపీని కోరినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని