అసమర్థ పాలనతోనే కరవు పరిస్థితులు

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అసమర్థ పాలనతోనే రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని కరీంనగర్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆరోపించారు.

Published : 28 Mar 2024 03:40 IST

కరీంనగర్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌

బెజ్జంకి, న్యూస్‌టుడే: ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అసమర్థ పాలనతోనే రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని కరీంనగర్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆరోపించారు. పంటలు కాపాడుకునేందుకు, రుణాలు చెల్లించేందుకు రైతులు పడుతున్న కష్టాలు చూస్తే ఉద్యమ కాలం నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయని అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా లక్ష్మీపూర్‌ శివారులో సాగునీరు అందక ఎండిన వరి, వడగళ్ల వానకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను మానకొండూర్‌ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ... ప్రాజెక్టుల్లో నీళ్లు నింపేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా రాజకీయాలకే పరిమితమవుతోందని విమర్శించారు. మేడిగడ్డ వద్ద వెంటనే మరమ్మతు పనులు చేపట్టి కాఫర్‌ డ్యామ్‌ నిర్మించాలని, వృథాగా పోతున్న జలాలను ప్రాజెక్టులకు ఎత్తిపోయాలన్నారు. రూ.2 లక్షల రుణ మాఫీపై ప్రభుత్వం వెంటనే బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని... అధికారులు రైతులకు నోటీసులు ఇవ్వకుండా బాధ్యత తీసుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని