భాజపా లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జుల నియామకం

రాష్ట్రంలో భాజపా పోటీ చేస్తున్న లోక్‌సభ స్థానాలకు సీనియర్‌ నేతలను ఇన్‌ఛార్జులుగా ఆ పార్టీ నియమించింది. వీరిలో నలుగురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు.

Published : 28 Mar 2024 05:17 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో భాజపా పోటీ చేస్తున్న లోక్‌సభ స్థానాలకు సీనియర్‌ నేతలను ఇన్‌ఛార్జులుగా ఆ పార్టీ నియమించింది. వీరిలో నలుగురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానానికి ఇన్‌ఛార్జిగా కాశీ విశ్వనాథరాజు, నరసాపురం- గారపాటి సీతారామాంజనేయ చౌదరి (తపనచౌదరి), అనకాపల్లి- మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌, అరకు- శివన్నారాయణ, తిరుపతికి దయాకర్‌రెడ్డిని పార్టీ నియమించింది.  రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పేరు ఖరారు కావాల్సి ఉంది. ఎన్నికల సన్నద్ధత, పనివిభజనపై పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో చర్చించి ఇన్‌ఛార్జులను నియమించారు. ఇంకా మరికొందరికి ఎన్నికల బాధ్యతలు అప్పగించనున్నారు. మరోవైపు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పార్టీకి సమయాన్ని కేటాయిస్తున్న కార్యకర్తలతో పార్టీ జాతీయ నేతలు అరుణ్‌సింగ్‌, సిద్దార్థనాథ్‌, ఎన్నికల సహ ఇన్‌ఛార్జి పేరాల చంద్రశేఖర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భాజపా పోటీచేసే స్థానాల్లో మండలానికి ఒకరు పర్యవేక్షిస్తూ పనిచేసేలా ప్రణాళికలు సిద్ధంచేశారు. ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బుధవారం ప్రారంభించారు.

విజయవాడలో భాజపా రాష్ట్ర కార్యాలయంలో పురందేశ్వరితో పరిపూర్ణానంద కొద్దిసేపు సమావేశమయ్యారు. అనంతరం హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఆశించినట్లు విలేకరులకు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు