కాంగ్రెస్‌ను ఆర్థికంగా కుంగదీయడానికే బ్యాంకు ఖాతాల స్తంభన

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ను ఆర్థికంగా కుంగదీయడానికి ఆదాయ పన్ను కట్టలేదనే సాకుతో బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాతా పాల్‌ ఆరోపించారు.

Published : 29 Mar 2024 02:54 IST

ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాతా పాల్‌ ఆరోపణ

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ను ఆర్థికంగా కుంగదీయడానికి ఆదాయ పన్ను కట్టలేదనే సాకుతో బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి సుజాతా పాల్‌ ఆరోపించారు. ప్రధాని మోదీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఈడీ, ఐటీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఆమె గురువారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌కు ఎంపీలు రూ.14 లక్షల నగదు చందాలు ఇచ్చినందుకు ఐటీ శాఖ 106 శాతం జరిమానా వేయడం దారుణమన్నారు. భాజపా విచారణ సంస్థలతో బెదిరించి వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల నుంచి ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో రూ.కోట్లు వసూలు చేసిందని ఆరోపించారు. పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ మరో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యుల పాస్‌పోర్టులను వెంటనే స్తంభింపచేయాలని డీజీపీ, సీఎం, కేంద్ర హోం శాఖలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల జీతాలు పెంచుతామని ఐఎన్‌టీయూసీ జాతీయ నాయకులు జనక్‌ ప్రసాద్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని