భాజపా మ్యానిఫెస్టో అంశాలపై చర్చ

భాజపా మ్యానిఫెస్టోలో తెలిపిన అంశాలపై ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చర్చించింది. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ నేతృత్వంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశమైంది.

Published : 29 Mar 2024 02:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా మ్యానిఫెస్టోలో తెలిపిన అంశాలపై ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చర్చించింది. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ నేతృత్వంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశమైంది. మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి చేపట్టాల్సిన ప్రత్యేక కార్యాచరణపై చర్చించారు. అనంతరం నాగర్‌కర్నూల్‌, హైదరాబాద్‌ స్థానాల్లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో  రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌, అభ్యర్థులు, నేతలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని