వైకాపాకు కాదు.. ప్రజలకు సేవ చేయండి

‘వాలంటీర్లు వైకాపాకు, ఆ పార్టీ నేతలకు కాకుండా ప్రజలకు సేవకులుగా పనిచేయాలి. రాజీనామా చేశామని అనుకున్నా క్రిమినల్‌ కేసులు నమోదైతే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

Published : 30 Mar 2024 05:07 IST

క్రిమినల్‌ కేసులు నమోదైతే భవిష్యత్తులో ఇబ్బంది
వాలంటీర్లకు అచ్చెన్నాయుడి సూచన

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: ‘వాలంటీర్లు వైకాపాకు, ఆ పార్టీ నేతలకు కాకుండా ప్రజలకు సేవకులుగా పనిచేయాలి. రాజీనామా చేశామని అనుకున్నా క్రిమినల్‌ కేసులు నమోదైతే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలోని ఆ పార్టీ కార్యాలయంలో శుక్రవారం తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ‘వాలంటీర్లందరూ చదువుకున్న వారే. ప్రజాధనంతో పనిచేస్తున్నందున ప్రజలకు సేవ చేయాలి. వాలంటీర్లు లేకుంటే గ్రామాలకు వెళ్లలేని పరిస్థితిలో వైకాపా నేతలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మెరుగైన వ్యవస్థగా తీర్చిద్ది మంచి జీతాలు, ఉపాధి శిక్షణతో ఉత్తమ అవకాశాలు కల్పిస్తాం. ఒకప్పుడు రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు, పరిస్థితులు ఉన్నప్పుడు తెదేపా ఆవిర్భవించింది. అప్పటి పరిస్థితిని తలదన్నేలా మారిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వంతో రక్షించుకోవలసిన ఆవశ్యకత ప్రజలందరిపైనా ఉంది’ అని అచ్చెన్న ఉద్ఘాటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని