అమ్మా.. వెళ్లొద్దు.. భోజనాలున్నాయ్‌..!

ప్రచారంలో వైకాపాకు అదీనూ ఓ ఎంపీకి ఘోర అవమానం ఎదురైంది. ‘పెద్దాయన మాట్లాడుతారు..’ అని చెబుతున్నా.. ప్రజలు వెళ్లిపోవడంతో ఏం చేయాలో అక్కడున్న నేతలకు అర్థం కాలేదు.

Published : 30 Mar 2024 05:11 IST

రోడ్‌షోకు వచ్చినవారికి నిర్వాహకుల అభ్యర్థన
ఎంపీ విజయసాయిరెడ్డి ప్రసంగం వినకుండానే వెళ్లిపోయిన జనం

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: ప్రచారంలో వైకాపాకు అదీనూ ఓ ఎంపీకి ఘోర అవమానం ఎదురైంది. ‘పెద్దాయన మాట్లాడుతారు..’ అని చెబుతున్నా.. ప్రజలు వెళ్లిపోవడంతో ఏం చేయాలో అక్కడున్న నేతలకు అర్థం కాలేదు. ఒక దశలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడనైనా చూడండి అనే స్థాయిలో బతిమాలుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో జరిగింది. ప్రస్తుత ఎంపీ, నెల్లూరు వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సీతారామపురంలో గురువారం ప్రచార రథంపై ప్రసంగిస్తుండగా.. సమీకరించిన జనం అక్కడి నుంచి వెనుదిరిగారు. మహిళలు పట్టించుకోకుండా వెళుతుండటంతో వాహనంపై ఉన్న సీతారామపురం-1 ఎంపీటీసీ సభ్యుడు అల్లూరు రాజు మైక్‌ పట్టుకుని ‘‘మహిళంతా వెళ్లిపోతున్నారు.. పెద్దాయన మాట్లాతున్నారు. అమ్మా.. అందరికీ భోజనాలు ఉన్నాయి. ఆగండి.. ఆగండి.. చెప్పినందుకైనా ఆగండి. వెనక్కి రండి. మీరు పోవద్దు’’ అంటూ బతిమాలుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఆ వీడియోలో ఎంపీ విజయసాయిరెడ్డికి ఓ వైపు నిల్చున్న మహిళ నాయకురాలు చేతులు ఊపుతూ మహిళలను వెనక్కి రమ్మని అభ్యర్థిస్తున్నారు. దీంతో ప్రచార వాహనంపై ఉన్న విజయసాయిరెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి నిశ్చేష్టులైపోయారు. పక్కనున్న మిగతా నేతలు వెళ్లిపోతున్న వారిని పిలిచే ప్రయత్నం చేస్తుండిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని