కేజ్రీవాల్‌ అరెస్టుపై ఇతర దేశాల విమర్శలు మంచిది కాదు

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టు విషయంలో ఇతర దేశాలు మన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని ఇది మంచిది కాదని.. కానీ ఈ పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తనకు తానుగా సృష్టించుకున్నదే అని ఎన్‌సీపీ(ఎస్‌పీ) అధినేత శరద్‌పవార్‌ అన్నారు.

Published : 30 Mar 2024 06:33 IST

ఆ పరిస్థితి ప్రభుత్వం సృష్టించుకున్నదే: శరద్‌పవార్‌

సతారా: దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టు విషయంలో ఇతర దేశాలు మన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని ఇది మంచిది కాదని.. కానీ ఈ పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తనకు తానుగా సృష్టించుకున్నదే అని ఎన్‌సీపీ(ఎస్‌పీ) అధినేత శరద్‌పవార్‌ అన్నారు. కేజ్రీవాల్‌ అరెస్టును ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా గమనించిందని చెప్పారు. శుక్రవారం ఆయన మహారాష్ట్రలోని సతారాలో విలేకరులతో మాట్లాడారు. ‘కేజ్రీవాల్‌ చేసిన నేరమేంటి? అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే దిల్లీలో మద్యం పాలసీ రూపొందించారు. అంతమాత్రాన ముఖ్యమంత్రిని, ఇద్దరు మంత్రులను అరెస్టు చేస్తారా? మరోవైపు మనీ లాండరింగ్‌ కేసులో హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఝార్ఖండ్‌కు చెందిన గిరిజనుడైన ఆయన్ను మూడు నెలలుగా జైలులో ఉంచారు. ఇది నియంతృత్వం కాకపోతే మరేంటి?’ అని ప్రశ్నించారు. వీటికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు. కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ ప్రతిపక్షపార్టీలు దిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఆదివారం ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని