నేతల ఫిర్యాదుల పరిష్కారానికి కమిటీ

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీలో నాయకుల మధ్య అభిప్రాయభేదాలు, ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి శనివారం మీడియాకు తెలిపారు.

Published : 31 Mar 2024 04:05 IST

పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీలో నాయకుల మధ్య అభిప్రాయభేదాలు, ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి శనివారం మీడియాకు తెలిపారు. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ ఇందులో సభ్యులుగా ఉంటారన్నారు. రాష్ట్రంలో నాయకులకు ఎలాంటి ఇబ్బందులు, ఫిర్యాదులు ఉన్నా ఈ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని రేవంత్‌రెడ్డి సూచించారు. పార్టీలో క్రమశిక్షణరాహిత్యాన్ని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. అంతర్గత అంశాలపై బహిరంగంగా విమర్శించకూడదని నాయకులకు ఆయన సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని