వైఎస్‌ఆర్‌టీఎఫ్‌ గౌరవాధ్యక్షుడు జాలిరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

ఎన్నికల కమిషన్‌ నిబంధనలను ఉల్లంఘించి.. అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌టీఎఫ్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ప్రకాశం డీఈవో సుభద్ర శనివారం ఉత్తర్వులిచ్చారు.

Published : 31 Mar 2024 04:56 IST

ఉపాధ్యాయ విధుల నుంచి తొలగింపు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఎన్నికల కమిషన్‌ నిబంధనలను ఉల్లంఘించి.. అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌టీఎఫ్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ప్రకాశం డీఈవో సుభద్ర శనివారం ఉత్తర్వులిచ్చారు. సింగరాయకొండ మండలం బింగినపల్లిలోని గిరిజన కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న జాలిరెడ్డి.. వైఎస్‌ఆర్‌టీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో కందుకూరు నియోజకవర్గానికి సంబంధించిన వైకాపా ఎన్నికల ప్రచారసభలో ఆయన పాల్గొన్నట్లు ఫిర్యాదు అందింది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆదేశాల మేరకు అందిన ఫిర్యాదుపై డీఈవో విచారణ చేయించారు. నిజమేనని తేలడంతో ఆయనను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని