వాలంటీర్‌ వ్యవస్థను సమర్థంగా తీర్చిదిద్దుతాం

తాము అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం కొనసాగుతున్న వాలంటీరు వ్యవస్థను సమర్థంగా తీర్చిదిద్దడంతోపాటు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా మారుస్తామని మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

Published : 01 Apr 2024 03:33 IST

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌  

ఈనాడు డిజిటల్‌, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే: తాము అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం కొనసాగుతున్న వాలంటీరు వ్యవస్థను సమర్థంగా తీర్చిదిద్దడంతోపాటు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా మారుస్తామని మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అన్నపూర్ణా అపార్ట్‌మెంట్‌ వాసులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అయిదేళ్లుగా జె-గ్యాంగ్‌ సాగించిన మైనింగ్‌ దోపిడీపై విచారణ చేపడతామన్నారు. ఎన్జీటీ ఆదేశాలు సైతం బేఖాతరు చేసి సహజ వనరులను విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు.

  • దుగ్గిరాల మండలం, మంగళగిరి పట్టణ, రూరల్‌ మండలాలకు చెందిన 130 వైకాపా సానుభూతిపరుల కుటుంబాలు లోకేశ్‌ సమక్షంలో ఆదివారం తెదేపాలో చేరాయి. ఉండవల్లి నివాసంలో వారికి లోకేశ్‌ కండువాలు కప్పి ఆహ్వానించారు.
  • లోకేశ్‌కు కేంద్రం జడ్‌ కేటగిరి భద్రత కల్పించడంతో సీఆర్‌పీఎఫ్‌ (వీఐపీ వింగ్‌) సిబ్బంది ఆదివారం నుంచి విధుల్లో చేరారు. 22 మంది సిబ్బంది మూడు ఫిఫ్టుల్లో నిరంతరం లోకేశ్‌కు భద్రత కల్పిస్తున్నారు.

ఐటీ పార్క్‌ వద్ద లోకేశ్‌ సెల్ఫీ: గత ప్రభుత్వంలో మంగళగిరి ఏపీఐఐసీ ఐటీ పార్క్‌లో ఏర్పాటుచేసిన పరిశ్రమల సముదాయాన్ని చూపుతూ నారా లోకేశ్‌ ఆదివారం సాయంత్రం సెల్ఫీ తీసుకున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడ పరిశ్రమలన్నింటినీ వెళ్లగొట్టి నిర్జీవంగా మార్చేశారని, ప్రతిపక్షంలో ఉన్నా ఐటీ పరిశ్రమను రప్పించి 150 మందికి స్థానికంగా ఉపాధి కల్పించానని లోకేశ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని