నా బీసీలు అంటూ సీఎం మొసలి కన్నీరు

‘వేదికలపై సీఎం జగన్‌ నా బీసీలు అని చెప్పుకొంటారు. అదే నిజమైతే జగన్‌ గుండె నిజంగా బీసీల కోసం తపించాలి. కానీ పరిస్థితి చూస్తుంటే బీసీలకు ప్రాధాన్యం కాదు కదా.. కనీసం వారిపై సానుభూతి కూడా చూపించడంలేదు’ అని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి మండిపడ్డారు.

Updated : 01 Apr 2024 05:18 IST

జగన్‌ తీరుపై పురందేశ్వరి మండిపాటు

ఈనాడు, అమరావతి: ‘వేదికలపై సీఎం జగన్‌ నా బీసీలు అని చెప్పుకొంటారు. అదే నిజమైతే జగన్‌ గుండె నిజంగా బీసీల కోసం తపించాలి. కానీ పరిస్థితి చూస్తుంటే బీసీలకు ప్రాధాన్యం కాదు కదా.. కనీసం వారిపై సానుభూతి కూడా చూపించడంలేదు’ అని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి మండిపడ్డారు. విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైనా రూ.2లక్షల అప్పు ఉంది. ఇది సరిపోదన్నట్లు సచివాలయం, గనులను ప్రభుత్వం తనఖా పెడుతోంది. వైకాపా చేసిన మోసాలు, జరిగిన అవినీతిని ప్రజలకు వివరిస్తాం’ అని పురందేశ్వరి తెలిపారు. ఈ సమావేశంలో ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గోపి శ్రీనివాస్‌, ఇతరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని