ఉద్యోగాలపై ప్రభుత్వానిది అంకెల గారడీ: కాంగ్రెస్‌

నిరుద్యోగం విషయంలో కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదంతా అంకెల గారడీయేనని కాంగ్రెస్‌ విమర్శించింది. ప్రస్తుతం ఉన్నంత నిరుద్యోగ రేటు గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఎద్దేవా చేశారు.

Published : 01 Apr 2024 05:43 IST

దిల్లీ: నిరుద్యోగం విషయంలో కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదంతా అంకెల గారడీయేనని కాంగ్రెస్‌ విమర్శించింది. ప్రస్తుతం ఉన్నంత నిరుద్యోగ రేటు గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఎద్దేవా చేశారు. 2020-23 మధ్య సంఘటిత రంగంలో 5.2 కోట్ల ఉద్యోగాలు కొత్తగా లభించినట్లు ఈపీఎఫ్‌వో, ఈఎస్‌ఐ, జాతీయ పింఛన్‌ వ్యవస్థ (ఎన్‌పీఎస్‌) గణాంకాల ఆధారంగా చెప్పడం అర్థరహితమని అన్నారు. మహా అయితే ఆ మూడేళ్ల వ్యవధిలో 2.27 కోట్ల ఉద్యోగాలు వచ్చి ఉంటాయని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనే వాస్తవ హామీకి ఇది చాలా దూరమని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని