అది ‘పరివార్‌ బచావో’ ర్యాలీ

దేశ రాజధాని దిల్లీలో ‘లోక్‌తంత్ర బచావో ర్యాలీ’ పేరిట విపక్ష ‘ఇండియా కూటమి’ నిర్వహిస్తున్న ర్యాలీపై అధికార భాజపా  విరుచుకుపడింది.

Published : 01 Apr 2024 05:44 IST

ఇండియా కూటమి సభపై భాజపా ఎద్దేవా

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ‘లోక్‌తంత్ర బచావో ర్యాలీ’ పేరిట విపక్ష ‘ఇండియా కూటమి’ నిర్వహిస్తున్న ర్యాలీపై అధికార భాజపా  విరుచుకుపడింది. అది ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ కాదని.. ‘కుటుంబాన్ని రక్షించండి.. అవినీతిని కప్పిపుచ్చండి’ అనే కార్యక్రమమని ఎద్దేవా చేసింది. తమ పాత నేరాలన్నింటినీ కప్పిపుచ్చుకునే పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని భాజపా ఎంపీ సుధాంశు త్రివేది ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు. ఒకప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమానికి వేదికగా నిలిచిన రామ్‌లీలా మైదానంలో ఇప్పుడు అవినీతిపరులను చూడబోతున్నామన్నారు.

రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న మోదీ సర్కార్‌ : కాంగ్రెస్‌

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఘర్షణాత్మక సమాఖ్య విధానంతో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల అధికారాలను అణచివేయడం, గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేయడం, రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడం, రాష్ట్రాల కార్యక్రమాలకు అడ్డుతగలడం, ఆర్థిక కేంద్రీకరణ వంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని