దక్షిణ భారతం మద్దతుతో భాజపాకు భారీ ఆధిక్యం

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో భాజపా సీట్లు పెరిగి, దేశంలో భారీ ఆధిక్యం సాధించడం ఖాయమని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు.

Updated : 01 Apr 2024 06:03 IST

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

నాగ్‌పుర్‌: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో భాజపా సీట్లు పెరిగి, దేశంలో భారీ ఆధిక్యం సాధించడం ఖాయమని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. ఆదివారం ఓ వార్తా సంస్థకు  ఇచ్చిన  ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 400సీట్లు గెలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని.. మోదీ మూడోసారీ ప్రధానిగా బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్లలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతిపక్షాలను బలహీన పరిచేందుకు ఈడీ, సీబీఐలను మోదీ ప్రభుత్వం ఆయుధాలుగా మారుస్తోందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ‘‘మేం ఎవరినీ ప్రేరేపించడం లేదు. ఎవరి ఇంట్లో రూ.300-400 కోట్లు దొరికినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎవరైనా తప్పు చేస్తే చర్యలు తీసుకుంటుంది’’ అని అన్నారు.‘‘తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో మేము కష్టపడి పనిచేశాం. ఈ సారి తెలుగు రాష్ట్రాల్లోనూ రాణిస్తాం. ఉత్తర రాష్ట్రాల్లో ప్రతిభ కనబరుస్తున్నాం కాబట్టి భాజపాకు 370సీట్లు, ఎన్డీయే కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయి’ అని గడ్కరీ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని