పింఛన్‌ సొమ్ము తినేసి.. జగన్‌ కొత్తనాటకం

అవ్వాతాతలకు ఇవ్వాల్సిన సొమ్మును తినేసి...తెదేపా అధినేత చంద్రబాబు ఇవ్వనివ్వడం లేదని సీఎం జగన్‌ మరో కొత్తనాటకం మొదలుపెట్టారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు.

Published : 02 Apr 2024 03:44 IST

తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి : అవ్వాతాతలకు ఇవ్వాల్సిన సొమ్మును తినేసి...తెదేపా అధినేత చంద్రబాబు ఇవ్వనివ్వడం లేదని సీఎం జగన్‌ మరో కొత్తనాటకం మొదలుపెట్టారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ‘జగన్‌ నాటకం, జగన్‌ మాయ, జగన్‌ మోసం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మోసాలు జనానికి తెలిశాయని, ఈ సారి గుణపాఠం తప్పదని ఎక్స్‌ వేదికగా సోమవారం హెచ్చరించారు. అధికారం కోసం జగన్‌ ఏళ్లుగా ఆడుతున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలివి..అని ఓ వీడియోను పోస్టు చేశారు. ‘‘ప్రజల్ని ఫూల్స్‌ చేయడంలో జగన్‌రెడ్డి తర్వాతే ఎవరైనా! 2019లో పింక్‌ డైమండ్‌ పేరుతో చంద్రబాబుపై నిందలేసి... ఏపీ ప్రజల్ని ఫూల్స్‌ చేశారు. 2022 నుంచి 2023 వరకు మద్య నిషేధం చేస్తా.. చేశాకే ఓట్లడుగుతా అని మరోసారి ఫూల్స్‌ను చేశారు. అసలు విషయం ఏంటంటే జగనే పెద్ద ఫూల్‌ అని ప్రజలందరికీ అర్థమైంది’’ అని వీడియోలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని