వాలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తాం

తన రాజకీయ క్రీడలో వాలంటీర్లను నాశనం చేయాలని సీఎం జగన్‌ చూస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు.

Published : 02 Apr 2024 03:46 IST

వైకాపా కోసం పనిచేయొద్దు
తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తన రాజకీయ క్రీడలో వాలంటీర్లను నాశనం చేయాలని సీఎం జగన్‌ చూస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. వాలంటీర్ల విషయంలో ఎన్డీయే కూటమికి స్పష్టత ఉందని, తాము అధికారంలోకి వచ్చాక కూడా ఆ వ్యవస్థను కొనసాగిస్తామని ‘ఎక్స్‌’ వేదికగా సోమవారం ఆయన స్పష్టం చేశారు. వారికి ఇప్పటి కంటే మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. ‘జగన్‌ మాటలు నమ్మొద్దు. వైకాపా కోసం పనిచేయొద్దు’ అని సూచించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక బినామీలకు దోచిపెట్టిన రూ.13 వేల కోట్లకు సంబంధించిన వివరాల్ని జగన్‌ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని