సెలవులే తీసుకోని మోదీతో రాహుల్‌కు పోలికా?: అమిత్‌షా

‘నేను 40 ఏళ్లుగా ప్రధాని మోదీతో కలిసి పని చేస్తున్నా. ఆయన ఏరోజూ సెలవు తీసుకున్నట్లు నేను చూడలేదు.

Updated : 03 Apr 2024 05:05 IST

ఈనాడు, బెంగళూరు : ‘నేను 40 ఏళ్లుగా ప్రధాని మోదీతో కలిసి పని చేస్తున్నా. ఆయన ఏరోజూ సెలవు తీసుకున్నట్లు నేను చూడలేదు. అలాంటి మోదీతో వేసవి సెలవుల కోసం విదేశాలకు వెళ్లొచ్చే రాహుల్‌గాంధీతో పోల్చటమేమిటి?’ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరులో ఎన్‌డీయే సమన్వయ, భాజపా ‘శక్తికేంద్ర’ ప్రముఖ్‌ల సమావేశాల్లో ఆయన మంగళవారం పాల్గొని మాట్లాడారు. రాజకీయ జీవితంలో సెలవు లేకుండానే పని చేసే మోదీతో పోల్చదగిన నేత ఎవరూ లేరన్నారు. ఈ సమావేశాల అనంతరం అమిత్‌ షా ఎన్‌డీయే అభ్యర్థి డాక్టర్‌ మంజునాథ్‌ పోటీ పడుతున్న బెంగళూరు గ్రామీణ నియోజకవర్గం పరిధి చెన్నపట్టణలో రోడ్‌షోలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని