మోదీకి వ్యతిరేకంగా జనం మనోగతం

లోక్‌సభ ఎన్నికల వేళ దేశ ప్రజల మనోగతం మారిపోయిందని.. ఇప్పుడు అది ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ఉందని ఎన్సీపీ(ఎస్‌పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ వ్యాఖ్యానించారు.

Published : 03 Apr 2024 03:33 IST

శరద్‌ పవార్‌ వ్యాఖ్యలు

నాగ్‌పుర్‌: లోక్‌సభ ఎన్నికల వేళ దేశ ప్రజల మనోగతం మారిపోయిందని.. ఇప్పుడు అది ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ఉందని ఎన్సీపీ(ఎస్‌పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ వ్యాఖ్యానించారు. నాగ్‌పుర్‌లో మంగళవారం విలేకర్లతో మాట్లాడిన ఆయన.. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. విపక్ష ‘ఇండియా’ కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరనేది ఇంకా ఆలోచించలేదన్నారు. తమ కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య లోక్‌సభ సీట్ల పంపకం చివరకు ఎలా ఉంటుందన్న అంశంపై ప్రశ్నించగా.. తానేమీ జ్యోతిష్యుడిని కాదంటూ సమాధానం ఇచ్చారు. మహారాష్ట్రలో భాజపాను ఓడించగలిగే సామర్థ్యం కలిగిన అభ్యర్థులకు ప్రజలు ఓట్లు వేస్తారని పవార్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని