స్వప్రయోజనాల కోసం మాదిగల ఆత్మగౌరవం తాకట్టు

మందకృష్ణ స్వప్రయోజనాల కోసం మాదిగల ఆత్మగౌరవాన్ని భాజపా దగ్గర తాకట్టు పెట్టారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు.

Published : 04 Apr 2024 04:07 IST

మందకృష్ణపై ఎమ్మెల్యే కవ్వంపల్లి ధ్వజం

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: మందకృష్ణ స్వప్రయోజనాల కోసం మాదిగల ఆత్మగౌరవాన్ని భాజపా దగ్గర తాకట్టు పెట్టారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భాజపా మెప్పు కోసమే మందకృష్ణ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని కవ్వంపల్లి స్పష్టం చేశారు.

 మాదిగలను రెచ్చగొట్టేందుకు మందకృష్ణ కుట్ర

మాదిగలను రెచ్చగొట్టి కాంగ్రెస్‌పై ఉసిగొల్పాలని మందకృష్ణ కుట్ర చేస్తున్నారని పీసీసీ ఎస్సీ సెల్‌ ఛైర్మన్‌ నగరిగారి ప్రీతం ఆరోపించారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళితజాతిని అణగదొక్కిన మతతత్వ పార్టీలకు మంద కృష్ణ మద్దతు ప్రకటించడం దురదృష్టకరమన్నారు. మాదిగలు ఆయనను నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆయన కుట్రలను ఖండించే విధంగా విధంగా పార్టీ శ్రేణులు గురువారం అన్ని జిల్లా, మండల కేంద్రాలలో మీడియా సమావేశాలు నిర్వహించాలని ప్రీతం కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని