కాంగ్రెస్‌ గూటికి ముగ్గురు సిద్దిపేట భారాస కౌన్సిలర్లు

సిద్దిపేట పురపాలికకు చెందిన ముగ్గురు భారాస కౌన్సిలర్లు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.

Published : 04 Apr 2024 05:36 IST

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: సిద్దిపేట పురపాలికకు చెందిన ముగ్గురు భారాస కౌన్సిలర్లు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో బుధవారం 7, 20, 37వ వార్డుల కౌన్సిలర్లు ముత్యాల శ్రీదేవి, రియాజుద్దీన్‌, సాకి బాల్‌లక్ష్మి హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తాము కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నామని తెలపగా ఆయన వారిని అభినందించారు. మంత్రి సురేఖ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తూఇమామ్‌ మాట్లాడుతూ.. మరికొందరు కౌన్సిలర్లు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలోనే సిద్దిపేట బల్దియాలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని చెప్పారు. కార్యక్రమంలో మెదక్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని