‘సజ్జల నకిలీ వార్తల ఫ్యాక్టరీ.. అదే పనిగా ప్రచారం చేస్తున్న తండ్రీ కుమారులు’

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవరెడ్డి రాష్ట్రంలో నకిలీ వార్తల ఫ్యాక్టరీని నడుపుతున్నారని మాజీ మంత్రి, తెదేపా నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

Updated : 12 Apr 2024 09:04 IST

డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవరెడ్డి రాష్ట్రంలో నకిలీ వార్తల ఫ్యాక్టరీని నడుపుతున్నారని మాజీ మంత్రి, తెదేపా నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. డీజీపీ రాజేంద్రనాథరెడ్డి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తాడేపల్లిలోని నెస్ట్‌స్పేస్‌ భవనంలో నకిలీ వార్తలను సృష్టిస్తూ సామాజిక మాధ్యమాలలో పోస్టు చేస్తున్నారు. దీనిలో ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు 300 మంది పని చేస్తున్నారు. వార్తా ఛానెళ్ల లోగోలను మార్చి ప్రచారం చేస్తున్నారు. ఓడిపోతామన్న నిరాశతోనే సజ్జల రామకృష్ణారెడ్డి దిగజారి ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న ఆయన ఎవరికి సలహాలు ఇస్తున్నారు? తప్పుడు వార్తలపై ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తాం’ అని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని