తెలంగాణలో ఒంటరి పోరే

లోక్‌సభ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీకి తెలంగాణలో ఎవరితోనూ పొత్తు లేదని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు.

Updated : 14 Apr 2024 05:55 IST

యూపీ, తమిళనాడుల్లో పొత్తు..
మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ

కేశవగిరి, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీకి తెలంగాణలో ఎవరితోనూ పొత్తు లేదని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో అప్నా దళ్‌ పార్టీ నాయకురాలు పల్లవి పటేల్‌తో కలిసి పోటీ చేస్తున్నామని, తమిళనాడులో ఏఐఏడీఎంకేతో జత కట్టామని చెప్పారు. మహారాష్ట్రలో పొత్తుపై తమ పార్టీ నేత ఇంతియాజ్‌ జలీల్‌ చర్చలు జరుపుతున్నారని, ఇంకా స్పష్టత రాలేదని అన్నారు. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బహదూర్‌పుర నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. హాషామాబాద్‌లోని ఓ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. బోగస్‌ ఓట్లతో మజ్లిస్‌ గెలుస్తోందని భాజపా అభ్యర్థి మాధవీలత అంటున్నారని విలేకరులు ప్రస్తావించగా ఆమె అలా అంటే అది ఎన్నికల కమిషన్‌ను తిట్టడం లాంటిదని అన్నారు. హైదరాబాద్‌లో వెనుకబడిన వర్గాలవారు, దళితులు, ముస్లింలు, క్రైస్తవులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని, బోగస్‌ ఓట్లంటే వారిని అవమానపర్చినట్లేనన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు