కాంగ్రెస్‌ 14 సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

పార్లమెంటు ఎన్నికల్లో భాజపా పదిఎంపీ స్థానాలు గెలుస్తుందని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Published : 14 Apr 2024 05:54 IST

ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే: పార్లమెంటు ఎన్నికల్లో భాజపా పదిఎంపీ స్థానాలు గెలుస్తుందని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ కాంగ్రెస్‌ 14 సీట్లు గెలుస్తుందంటున్నారని, అదే జరిగితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని సవాల్‌ చేశారు. ఆదిలాబాద్‌లో శనివారం పార్లమెంటు నియోజకవర్గ విజయ సంకల్ప సమ్మేళనం పేరిట ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అధ్యక్షతన భాజపా బూత్‌స్థాయి, శక్తికేంద్రాల బాధ్యులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్‌లో రూ.3 వేల కోట్లకు సంబంధించిన స్థలం లీజును ఓ సంస్థకు రద్దు చేసి, తిరిగి అదే సంస్థకు అప్పజెప్పడంలో అక్రమాలు జరిగాయన్నారు. దీనిపై సీఎం నుంచి సమాధానం లేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని