నేను పెట్టుబడులు తెస్తే.. జగన్‌ డ్రగ్స్‌ తెచ్చారు

‘రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే మంచి ఫలితాలు ఇవ్వదని అంబేడ్కర్‌ ఆనాడే చెప్పారు.

Published : 15 Apr 2024 06:41 IST

ఈనాడు-అనకాపల్లి, న్యూస్‌టుడే-పాయకరావుపేట/పట్టణం: ‘రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే మంచి ఫలితాలు ఇవ్వదని అంబేడ్కర్‌ ఆనాడే చెప్పారు. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని అమలుచేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఓటు వజ్రాయుధం. మీ ఓటును కూటమికి వేయండి. మీ భవిష్యత్తుకు గ్యారంటీ నాది’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ‘తెదేపా హయాంలో విదేశాల నుంచి పెట్టుబడులను తెచ్చేవాళ్లం.. జగన్‌ విదేశాల నుంచి డ్రగ్స్‌ తీసుకొస్తున్నారు. నాసిరకం మద్యాన్ని మూడు రెట్లకు అమ్మి పేదల రక్తాన్ని జలగలా జగన్‌ తాగేశారు. ఎన్నికల ముందు కొత్త డ్రామాలతో మళ్లీ వస్తున్నారు. ఎవరూ నమ్మొద్దు. అంబేడ్కర్‌ జయంతి రోజున ఎస్సీ రిజర్వుడు స్థానంలో నిలబడి మాట్లాడుతుండటం అదృష్టంగా భావిస్తున్నాను. 27 దళిత పథకాలను రద్దుచేసిన ద్రోహి జగన్‌... మాస్క్‌ అడిగిన పాపానికి డాక్టర్‌ సుధాకర్‌ను వేధించి చనిపోయేలా చేశారు. డాక్టర్‌ సుధాకర్‌ ఆత్మ శాంతించాలంటే వైకాపాను చిత్తుగా ఓడించాలి. ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేశ్‌ అత్యంత సమర్థుడు. ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎమ్మెల్యేగా వంగలపూడి అనితను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని