కాంగ్రెస్‌ సీట్ల కేటాయింపులో మాదిగలకు అన్యాయం: మందకృష్ణ

పార్లమెంట్‌ సీట్ల కేటాయింపులో కాంగ్రెస్‌ పార్టీ మాదిగలకు తీవ్ర అన్యాయం చేసిందని, ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీని భూస్థాపితం చేస్తామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.

Updated : 15 Apr 2024 06:21 IST

సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: పార్లమెంట్‌ సీట్ల కేటాయింపులో కాంగ్రెస్‌ పార్టీ మాదిగలకు తీవ్ర అన్యాయం చేసిందని, ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీని భూస్థాపితం చేస్తామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఆదివారం సిరిసిల్లలో ఎమ్మార్పీఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరై మంద కృష్ణ మాదిగ మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీలకు మూడు సీట్లు ఉంటే అందులో మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్‌ పార్టీ ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు మాలల మాట వింటూ మాదిగలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ని ఓడించడానికి మాదిగలంతా ఏకమై భాజపాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌ఛార్జి ఇంజం వెంకటస్వామి మాదిగ, బెజ్జంకి అనిల్‌మాదిగ, ఎమ్మార్పీఎస్‌ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు కనాపూర్‌ లక్ష్మణ్‌ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని