జనసేనలో 3 వేల మందికిపైగా చేరిక

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన సుమారు మూడువేల మందికి పైగా వైకాపాకు చెందిన నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరారు.

Published : 15 Apr 2024 05:19 IST

భోగాపురం, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన సుమారు మూడువేల మందికి పైగా వైకాపాకు చెందిన నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరారు. భోగాపురంలోని పార్టీ కార్యాలయం ఆవరణలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కూటమి అభ్యర్థి లోకం నాగమాధవి మాట్లాడారు. నియోజకవర్గంలో అవినీతి అనకొండగా పేరొందిన వైకాపా ఎమ్మెల్యే అప్పలనాయుడిని ఓడించాలనే ధ్యేయంతో ప్రజలు ఉన్నారని ఈ ప్రభంజనమే చెబుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కాకర్లపూడి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో నెల్లిమర్ల నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌ బంగారు సరోజని, మత్స్యకార కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మైలపల్లి నర్సింహులు, యాత కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చెల్లుబోయిన నర్సింగరావు, గూడెపువలస సర్పంచి మట్టా అయ్యప్పరెడ్డి, నాయకులు ఎం.ఇందుమతి, దారపు లక్ష్మణరెడ్డి, కౌన్సిలర్‌ పి.సత్యవతి, కె.శ్రీను తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వారికి మాధవి కండువాలు వేసి ఆహ్వానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని