దేశంలోనే భారీ మెజార్టీతో నల్గొండలో గెలుస్తాం

దేశంలోనే భారీ మెజార్టీతో నల్గొండ ఎంపీ స్థానంలో విజయం సాధిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated : 17 Apr 2024 06:22 IST

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కవితకు రెండేళ్లు బెయిల్‌రాదు: కోమటిరెడ్డి

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: దేశంలోనే భారీ మెజార్టీతో నల్గొండ ఎంపీ స్థానంలో విజయం సాధిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎన్నెస్పీ క్యాంపు మైదానంలో మంగళవారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధ్యక్షతన అభ్యర్థి రఘువీర్‌రెడ్డికి మద్దతుగా ఏర్పాటు చేసిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో భాజపా అనుసరిస్తున్న విధానాలతో ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఏర్పడుతోందన్నారు. దేశంలో ఇండియా కూటమి విజయం సాధించి రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో మోదీ పార్లమెంటులో తెలంగాణను హేళన చేస్తూ మాట్లాడారని పేర్కొన్నారు. ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌లా తాము అబద్ధాలు చెప్పమని, చేసేదే చెబుతామని, వంద రోజుల పాలనలోనే ప్రజలకు పథకాలు అందించామని చెప్పారు. కేసీఆర్‌ బిడ్డ కవితకు రెండేళ్లపాటు బెయిల్‌ రాదని.. కేసీఆర్‌, కేటీఆర్‌ పదేళ్ల దోపిడీని తిరిగి రాబట్టి ప్రజలకు పంచుతామని చెప్పారు. అధికారం కోల్పోయిన తర్వాత వారు సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. రేవంత్‌ భాజపాలోకి వెళ్తారంటూ ప్రచారం చేయటం తగదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని