దళితుల ఆశీస్సులున్నంత వరకూ.. ఏ కటకటాలూ ఆపలేవు..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో దళితుల ఆశీస్సులు ఉన్నంతవరకూ తనను ఏ కటకటాలూ ఆపలేవని, ఎవరూ ఏమీ చేయలేరని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించారు.

Published : 17 Apr 2024 05:44 IST

మండపేటలో కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు

ద్వారపూడి, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో దళితుల ఆశీస్సులు ఉన్నంతవరకూ తనను ఏ కటకటాలూ ఆపలేవని, ఎవరూ ఏమీ చేయలేరని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించారు. శిరోముండనం కేసులో శిక్ష అమలును కోర్టు నిలిపివేసిన తర్వాత మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆయన మండపేట విజయలక్ష్మీనగర్‌లోని పార్టీ కార్యాలయానికి చేరుకొని, అప్పటికే అక్కడ వేచిచూస్తున్న అభిమానులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఇన్నాళ్లూ ఈ కేసును భూతద్దంలో చూపి.. ఏదో అయిపోతుందని ఆశించినవారి కలలు ఈ రోజు తీర్పుతో కల్లలయ్యాయని విమర్శించారు. శిక్షపడిన రెండు గంటల్లోనే అందరి ఆశీస్సులు, అభిమానంతో బయటకు వచ్చానన్నారు. గతంలో ఈ కేసులో జైలులో ఉండి బెయిల్‌పై బయటకొచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గంలోని దళితులు తన వెన్నంటి ఉండి 20వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని