‘మోదీ వేవ్‌’ ఎప్పుడూ ఉంటుంది: నవనీత్‌ రాణా

దేశంలో ‘మోదీ వేవ్‌’ లేదని తాను వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతుండటంపై మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, సినీ నటి నవనీత్‌ రాణా బుధవారం స్పందించారు.

Published : 18 Apr 2024 04:56 IST

అమరావతి(మహారాష్ట్ర): దేశంలో ‘మోదీ వేవ్‌’ లేదని తాను వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతుండటంపై మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, సినీ నటి నవనీత్‌ రాణా బుధవారం స్పందించారు. తన వ్యాఖ్యలను రాజకీయ ప్రత్యర్థులు వక్రీకరించారని ఆమె పేర్కొన్నారు. మోదీ వేవ్‌ గతంలో ఉందని, ఇప్పుడూ ఉందని, ఎప్పటికీ ఉంటుందని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధికి మోదీ అవసరమని పేర్కొన్నారు. సోమవారం ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ ‘‘పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ పోరాడాలి. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఓటర్లందరినీ బూత్‌కు తీసుకురావాలి. మోదీ వేవ్‌ ఉందనుకొనేవారు నేను 2019లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన విషయాన్ని గుర్తుచేసుకోవాలి’’ అని ఆమె అన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆమె వాస్తవం చెప్పారంటూ ఎన్‌సీపీ(శరద్‌ పవార్‌ వర్గం), శివసేన(ఉద్ధవ్‌ వర్గం) వ్యాఖ్యానించడంపై ఆమె పై విధంగా స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని