జగన్‌ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్‌కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్‌ ఎదుటే.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు జై కొట్టడం చర్చనీయాంశమైంది.

Published : 20 Apr 2024 04:59 IST

ఈనాడు, కాకినాడ: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్‌కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్‌ ఎదుటే.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం వద్ద ఏడీబీ రోడ్డులో ఆదిత్య విశ్వవిద్యాలయం ఉంది. ఈ విద్యాలయం మీదుగా జగన్‌ బస్సు యాత్ర శుక్రవారం మధ్యాహ్నం సాగింది. దీంతో ముందస్తుగా సిద్ధమైన యాజమాన్యం.. జగనన్న విద్యాదీవెనతో విద్యార్థులకు మేలు జరిగినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ‘థాంక్యూ సీఎం సార్‌’.. అంటూ భారీ ఫ్లెక్సీని ముద్రించి.. విద్యార్థులను యూనివర్సిటీ ఎదుట నిలబెట్టి ఆ ఫ్లెక్సీ పట్టుకుని నినాదాలు చేయించడానికి సిద్ధమైంది. విద్యార్థుల సమూహాన్ని చూసిన సీఎం బస్సు ఆపి కళాశాల వైస్‌ ఛైర్మన్‌ సతీష్‌రెడ్డితో మాట్లాడారు. విద్యా దీవెన అందరికీ అందుతుందా..? అని ఆరా తీశారు. ఇంతలో విద్యార్థులు ‘బాబులకే బాబు.. కల్యాణ్‌ బాబు’ అంటూ జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ నినాదాల తీవ్రత పెరగడంతో అసహనానికి గురై సీఎం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని