తంబళ్లపల్లెలో తెదేపా కార్యకర్తలపై లాఠీ ఛార్జ్‌

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ ఎన్డీయే అభ్యర్థి జయచంద్రారెడ్డి(తెదేపా) నామినేషన్‌ సందర్భంగా తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారు.

Published : 20 Apr 2024 04:41 IST

కూటమి అభ్యర్థి జయచంద్రారెడ్డి నామినేషన్‌ సందర్భంగా ఘటన

ములకలచెరువు గ్రామీణ, న్యూస్‌టుడే: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ ఎన్డీయే అభ్యర్థి జయచంద్రారెడ్డి(తెదేపా) నామినేషన్‌ సందర్భంగా తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారు. నియోజకవర్గంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన జయచంద్రారెడ్డిని అనుసరించి కార్యకర్తలు కూడా భారీగా తరలి వెళ్లారు. పోలీసులు వారిని 300 మీటర్ల దూరంలో ఆపారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు వేయడంతో శిక్షణ డీఎస్పీ ప్రశాంత్‌కు గాయమైంది. దీంతో పోలీసులు తెదేపా శ్రేణులపై లాఠీఛార్జీ చేయడంతో కొందరికి గాయాలయ్యాయి. గురువారం వైకాపా అభ్యర్థి నామినేషన్‌ వేసే సమయంలో ఆ పార్టీ కార్యకర్తలను 100 మీటర్ల దూరం వరకు అనుమతించిన పోలీసులు తమను మాత్రం 300 మీటర్ల దూరంలో నిలువరించడంపై కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అధికార పార్టీ నాయకులకు పోలీసులు కొమ్ముకాస్తూ అత్యుత్సాహం చూపుతున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని