షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసు

రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆమె వివేకా హత్యను ప్రస్తావించి వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు అవినాష్‌రెడ్డి, మల్లాది విష్ణు, వివేకా హత్య కేసులో అప్రూవర్‌ దస్తగిరి ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.

Published : 20 Apr 2024 05:38 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆమె వివేకా హత్యను ప్రస్తావించి వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు అవినాష్‌రెడ్డి, మల్లాది విష్ణు, వివేకా హత్య కేసులో అప్రూవర్‌ దస్తగిరి ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన షర్మిలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నోటీసు జారీ చేసిన ఎన్నికల సంఘం 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని షర్మిలకు సూచించింది. లేదంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని