కాంగ్రెస్‌లో చేరడం లేదు: రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌

తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరడం లేదని రాజేంద్రనగర్‌ భారాస ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌ తెలిపారు. గత రెండు రోజులుగా కార్యకర్తలు, స్థానిక నేతలతో చర్చించిన ఆయన.. శనివారం ‘ఈనాడు’ ప్రతినిధితో మాట్లాడారు.

Updated : 21 Apr 2024 13:45 IST

ఈనాడు-హైదరాబాద్‌: తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరడం లేదని రాజేంద్రనగర్‌ భారాస ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌ తెలిపారు. గత రెండు రోజులుగా కార్యకర్తలు, స్థానిక నేతలతో చర్చించిన ఆయన.. శనివారం ‘ఈనాడు’ ప్రతినిధితో మాట్లాడారు. శుక్రవారం తాను సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సమయంలో కాంగ్రెస్‌లో చేరికపై చర్చ జరిగిన విషయం వాస్తవమేనని అన్నారు. దీనిపై పరిశీలించాలని సీఎం కోరారే తప్ప.. ఒత్తిడి చేయలేదని తెలిపారు. కార్యకర్తలతో సమావేశమైన తరువాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పి వచ్చానన్నారు. ఎక్కువ మంది కార్యకర్తలు పార్టీ మారొద్దని సూచించినట్లు తెలిపారు. వారి మనోభావాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌లో చేరాలనుకోవడం లేదన్నారు. తానొక్కడినే చేరితే సాంకేతిక కారణాలతో ఎమ్మెల్యేగా అనర్హుడిగా మారే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే అప్పుడు తిరిగి ఆలోచన చేస్తారా.. అన్న ప్రశ్నకు మళ్లీ కార్యకర్తలతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని ప్రకాశ్‌గౌడ్‌ చెప్పారు. తన నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కోసమే ముఖ్యమంత్రిని తరచూ కలుస్తున్నానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని