లిక్కర్‌, మైనింగ్‌ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి

రాష్ట్రంలో లిక్కర్‌, మైనింగ్‌ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థ్‌నాథ్‌సింగ్‌ ధ్వజమెత్తారు.

Updated : 24 Apr 2024 07:21 IST

భాజపా నేత సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో లిక్కర్‌, మైనింగ్‌ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థ్‌నాథ్‌సింగ్‌ ధ్వజమెత్తారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ‘అయిదేళ్ల వైకాపా పాలనలో 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేంద్రం కిసాన్‌ సమ్మాన్‌ నిధి, జలజీవన్‌, ఇతర పథకాల కింద నిధులు మంజూరు చేస్తుంటే వాటికి స్టిక్కర్లు అంటించి వైకాపా ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటోంది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావడం ఖాయం. సర్వేల ఫలితాలు కూటమికే అనుకూలంగా ఉన్నాయి. ప్రచారానికి ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఇతర అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు. అధికారుల వ్యవహార శైలి గురించి చేసిన ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంటుంది’ అని పేర్కొన్నారు. భాజపా జాతీయ మేనిఫెస్టో తెలుగు అనువాద పుస్తకాన్ని సిద్ధార్థ్‌నాథ్‌సింగ్‌, రాష్ట్ర ఎన్నికల సమన్వయకర్త పేరాల చంద్రశేఖర్‌, పార్టీ నేతలు సూర్యనారాయణరాజు, కిలారుదిలీప్‌, యామినీశర్మ విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని