మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు

ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోపించారు.

Published : 18 May 2024 04:44 IST

శివసేన(యూబీటీ) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే

ఠాణె: ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా గురువారం ఠాణేలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్ధవ్‌ మాట్లాడుతూ.. మోదీ తన వ్యాఖ్యలతో వివాదాలు రేకెత్తిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో మెజారిటీ సాధిస్తామని గతంలో చెప్పుకొన్న భాజపా ప్రస్తుతం వారసత్వ రాజకీయాలంటూ ఆరోపణలు చేసే స్థాయికి పడిపోయిందని విమర్శించారు. మోదీ ప్రధాని పదవి తిరిగి పొందడానికి తహతహలాడుతున్నారని, భవిష్య తరానికి దాన్ని ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా లేరని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు