మహాలక్ష్మి పథకంపై మోదీ వ్యాఖ్యలు సరికాదు

మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Published : 19 May 2024 05:37 IST

 మంత్రి పొన్నం

ఈనాడు, హైదరాబాద్‌: మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి.. శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికే ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి, మెట్రోరైలుకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. చిన్నచిన్న అంశాలపై మాట్లాడి ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చవద్దని హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు