గెలిస్తే బాలీవుడ్‌కు వీడ్కోలు!.. మండీ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్‌

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే బాలీవుడ్‌కు వీడ్కోలు పలుకుతానని హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ భాజపా అభ్యర్థి, సినీనటి కంగనా రనౌత్‌ పేర్కొన్నారు.

Updated : 20 May 2024 05:39 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే బాలీవుడ్‌కు వీడ్కోలు పలుకుతానని హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ భాజపా అభ్యర్థి, సినీనటి కంగనా రనౌత్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే సినిమాలకు దూరంగా ఉంటారా? అనే ప్రశ్నకు ఆమె అవుననే సమాధానమిచ్చారు. ‘‘బాలీవుడ్‌లో నేను విజయం సాధించా. నటిగా ఎన్నో అవార్డులు గెలుచుకున్నా. మండీ ఎంపీగా గెలుపొందితే బాలీవుడ్‌కు వీడ్కోలు పలకాలనుకుంటున్నా. ఒక ఉత్తమ ఎంపీగా ప్రజలకు నావంతు సేవ చేస్తా. అదే గొప్ప పురస్కారంగా భావిస్తా’’ అని కంగనా బదులిచ్చారు. అంతకుముందు మరో వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె భిన్నంగా స్పందించారు. ‘‘ఎన్నికల ముందు నేను సంతకం చేసిన కొన్ని సినిమాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ కారణంతో వెంటనే బాలీవుడ్‌ను విడిచిపెట్టలేను’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని