రాళ్లదాడి ఘటనలో 47 మందిపై కేసు

వైఎస్సార్‌ జిల్లా కడప రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధి గౌస్‌నగర్‌లో ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న రాత్రి వైకాపా, తెదేపా నేతలు, కార్యకర్తల మధ్య జరిగిన రాళ్లదాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఎట్టకేలకు సోమవారం కేసులు నమోదు చేశారు.

Published : 21 May 2024 03:22 IST

నిందితుల్లో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, తెదేపా నేత శ్రీనివాసరెడ్డి 

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: వైఎస్సార్‌ జిల్లా కడప రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధి గౌస్‌నగర్‌లో ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న రాత్రి వైకాపా, తెదేపా నేతలు, కార్యకర్తల మధ్య జరిగిన రాళ్లదాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఎట్టకేలకు సోమవారం కేసులు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, వీడియోలను పరిశీలించి, 47 మందిని గుర్తించారు. అందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషాతో పాటు వైకాపాకు చెందిన 22 మందిపై, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన 25 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ ఇబ్రహీం తెలిపారు. వారందరికీ 41ఏ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనలో పాల్గొన్నవారిలో చాలామంది పరారీలో ఉన్నారు. దీంతో పోలీసులు వారి నివాసాలకు వెళ్లి నోటీసులు అందజేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని