మిథున్‌ చక్రవర్తి రోడ్‌ షోపై రాళ్లదాడి

లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో సినీనటుడు, భాజపా నేత మిథున్‌ చక్రవర్తి రోడ్‌ షోపై కొందరు వ్యక్తులు రాళ్లు, బాటిళ్లతో దాడి చేశారు.

Published : 22 May 2024 05:29 IST

మేదినీపుర్‌: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో సినీనటుడు, భాజపా నేత మిథున్‌ చక్రవర్తి రోడ్‌ షోపై కొందరు వ్యక్తులు రాళ్లు, బాటిళ్లతో దాడి చేశారు. మేదినీపుర్‌ లోక్‌సభ స్థానంలో భాజపా అభ్యర్థికి మద్దతుగా మంగళవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఈ దాడి జరిగింది. భాజపా శ్రేణులు దాడిని ప్రతిఘటించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరిస్థితిని సత్వరం అదుపులోకి తీసుకొచ్చామని, మిథున్‌ చక్రవర్తి క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ దాడిపై భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని