ఎమ్మెల్యే పిన్నెల్లిపై తీసుకున్న చర్యలేంటి?

పాల్వాయి గేటు పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం ధ్వంసం చేసిన సంఘటనలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రమేయముందా? ప్రమేయం ఉన్నట్లయితే ఈ కేసులో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారా?

Published : 23 May 2024 05:06 IST

సీఈవోకు లేఖ రాసిన కేంద్ర ఎన్నికల సంఘం
తక్షణం అరెస్టు చేయాలని ఆదేశాలు
లోకేశ్‌ పోస్టుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం

ఈనాడు, అమరావతి: పాల్వాయి గేటు పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం ధ్వంసం చేసిన సంఘటనలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రమేయముందా? ప్రమేయం ఉన్నట్లయితే ఈ కేసులో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారా? నిందితుడిగా చేర్చి ఉంటే అరెస్టు చేశారా? అలా చేయకపోతే ఈవీఎంను ధ్వంసం చేసినందుకు సదరు ఎమ్మెల్యేపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి వెంటనే అరెస్టు చేయండని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మంగళవారం ఆదేశాలందాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడి స్వయంగా ఈవీఎం ధ్వంసానికి పాల్పడటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా పరిగణించింది. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదికను బుధవారం సాయంత్రం ఐదింటిలోగా పంపాలని సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనాను ఆదేశించింది. ఎమ్మెల్యేను తక్షణం అరెస్టు చేయాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్‌ సెక్రటరీ అవినాష్‌కుమార్‌ లేఖ రాశారు. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎక్స్‌లో చేసిన పోస్టు, ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం పగులగొడుతున్నట్లు ట్యాగ్‌ చేసిన వీడియో క్లిప్పింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ వ్యవహారంపై వాస్తవ నివేదికతోపాటు అభిప్రాయాన్ని తెలపాలని సీఈవోను ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని