లాలూ కుమార్తె రోహిణిపై కేసు నమోదు

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె రోహిణీ ఆచార్యపై కేసు నమోదైంది. బిహార్‌లోని సారణ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్‌ సందర్భంగా జరిగిన అక్రమాలు, అనంతరం జరిగిన గొడవల్లో ఒక వ్యక్తి మరణించడం తదితర ఘటనలకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఆమె పేరును చేర్చినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు.

Published : 24 May 2024 03:40 IST

పట్నా:  ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె రోహిణీ ఆచార్యపై కేసు నమోదైంది. బిహార్‌లోని సారణ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్‌ సందర్భంగా జరిగిన అక్రమాలు, అనంతరం జరిగిన గొడవల్లో ఒక వ్యక్తి మరణించడం తదితర ఘటనలకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఆమె పేరును చేర్చినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. సారణ్‌లో భాజపా ఎంపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీపై మహాగఠ్‌బంధన్‌ తరఫున రోహిణి పోటీ చేస్తున్నారు. ఈ వారం మొదట్లో నియోజకవర్గంలో అల్లర్లు చెలరేగగా పోలీసులు నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఏడుగురు అనుచరులు, 50 మంది గుర్తుతెలియని వ్యక్తులతో వచ్చిన రోహిణి.. ఛప్రా ప్రాంతంలో రెండు పోలింగ్‌ బూత్‌ల్లో అక్రమాలకు పాల్పడ్డారని మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా ఒక ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు ఆమె పేరును చేర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని