ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలివి: సోనియా

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి ప్రస్తుత ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ పేర్కొన్నారు.

Published : 24 May 2024 03:47 IST

దిల్లీ: ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి ప్రస్తుత ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం వీడియో సందేశం వెలువరించారు. ఈ పోరాటంలో ప్రజలు తమవంతు పాత్ర పోషించాలని, దిల్లీలోని ఏడు స్థానాల్లోనూ ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వ్యవస్థలపై దాడి గురించి ఎన్నికల్లో పోరాడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ హరియాణాలోని సిర్సాలో మాట్లాడుతూ- నిరుద్యోగం, అవినీతి, ద్రవ్యోల్బణాలకు భాజపా సర్కారే కారణమని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు