ఆరో దశ ఎన్నికల ప్రచారానికి తెర

సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆరో దశ పోలింగుకు రంగం సిద్ధమైంది. ఈ విడతలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 58 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 25న పోలింగ్‌ జరగనుంది.

Published : 24 May 2024 03:49 IST

రేపు 58 స్థానాల్లో పోలింగ్‌ 

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆరో దశ పోలింగుకు రంగం సిద్ధమైంది. ఈ విడతలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 58 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 25న పోలింగ్‌ జరగనుంది. అందువల్ల గురువారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడింది. ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తదితరులు చివరిరోజు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. దిల్లీ, హరియాణాలోని అన్ని స్థానాలు ఈ దశలోనే ఓటర్ల తీర్పును కోరుతున్నాయి. ఇంతవరకు 25 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 428 స్థానాలకు ఓట్ల ప్రక్రియ పూర్తి కాగా శనివారంతో ఇది 486 స్థానాలకు చేరుతుంది.  

బరిలో ప్రముఖులు 

ఆరో దశ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును కోరబోతున్న ప్రముఖుల్లో ధర్మేంద్ర ప్రధాన్‌ (సంబల్‌పుర్‌-ఒడిశా); మనోజ్‌ తివారీ (భాజపా), కన్హయ కుమార్‌ (కాంగ్రెస్‌-ఈశాన్య దిల్లీ); మెహబూబా ముఫ్తీ (పీడీపీ- అనంతనాగ్‌-రాజౌరీ), భాజపా నేత అభిజీత్‌ గంగోపాధ్యాయ (తమ్లుక్, బెంగాల్‌) తదితరులు ఉన్నారు. భాజపా నుంచి హరియాణాలో మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ (కర్నాల్‌), నవీన్‌జిందాల్‌ (కురుక్షేత్ర), రావ్‌ ఇంద్రజీత్‌ సింగ్‌ (గురుగ్రామ్‌) కూడా ప్రజాతీర్పును కోరుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని