భాజపా పిటిషన్‌పై విచారణ జూన్‌ 4కు వాయిదా

భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో మే 4న కాంగ్రెస్‌ జనజాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై భాజపా ఇచ్చిన ప్రైవేటు ఫిర్యాదును హైదరాబాద్‌ స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు వెంటనే విచారించేలా ఆదేశించాలని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు జూన్‌ 4కు వాయిదా వేసింది.

Published : 25 May 2024 03:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో మే 4న కాంగ్రెస్‌ జనజాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై భాజపా ఇచ్చిన ప్రైవేటు ఫిర్యాదును హైదరాబాద్‌ స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు వెంటనే విచారించేలా ఆదేశించాలని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు జూన్‌ 4కు వాయిదా వేసింది. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వెంకటేశ్వర్లు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని సీఎం నిరాధార ఆరోపణలు చేశారన్నారు. దీనిపై తక్షణం విచారించి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉందన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపిస్తూ.. దీనిని లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ రూపంలో విచారించాల్సిన అవసరం లేదని గడువు కావాలని కోరారు. వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి విచారణను జూన్‌ 4కు వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు