అగ్నిపథ్‌తో యువతను మోదీ మోసం చేశారు: రాహుల్‌

సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని కలలు కన్న యువతను అగ్నిపథ్‌ పథకం బలవంతపు అమలు ద్వారా ప్రధాని మోదీ మోసం చేశారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు.

Published : 25 May 2024 05:43 IST

దిల్లీ: సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని కలలు కన్న యువతను అగ్నిపథ్‌ పథకం బలవంతపు అమలు ద్వారా ప్రధాని మోదీ మోసం చేశారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక యువతకు న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. సాయుధ బలగాల్లో చేరాలని కోరుకొని, అగ్నిపథ్‌ పథకం కారణంగా ఆ అవకాశానికి దూరమైన కొందరు యువకులతో రాహుల్‌ ఇటీవల ఓ టెంపో వాహనంలో ప్రయాణిస్తూ మాట్లాడారు. సంబంధిత వీడియోను శుక్రవారం ‘ఎక్స్‌’లో పంచుకొని పై వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని