అసత్యాలు, ద్వేషాన్ని తిరస్కరించిన ప్రజలు

లోక్‌సభ ఎన్నికల్లో పూర్తయిన అయిదు దశల పోలింగ్‌లో ప్రజలు అసత్యాలు, ద్వేషం, ప్రచారాన్ని తిరస్కరించారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. తమ జీవితాలకు సంబంధించిన వాస్తవ అంశాలకే వారు ప్రాధాన్యతను ఇచ్చారన్నారు.

Published : 26 May 2024 04:01 IST

అయిదు దశల ఎన్నికల పోలింగ్‌పై రాహుల్‌ గాంధీ

దిల్లీ, అమృత్‌సర్‌: లోక్‌సభ ఎన్నికల్లో పూర్తయిన అయిదు దశల పోలింగ్‌లో ప్రజలు అసత్యాలు, ద్వేషం, ప్రచారాన్ని తిరస్కరించారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. తమ జీవితాలకు సంబంధించిన వాస్తవ అంశాలకే వారు ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. శనివారం జరిగిన ఆరో దశ పోలింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. తమ హక్కులు, కుటుంబాల భవిష్యత్తు కోసం ఓటెయ్యాలని కోరారు. రాహుల్‌ గాంధీ, ఆయన తల్లి సోనియాగాంధీ దిల్లీలో ఓ పోలింగ్‌ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఇంకు పూసిన వేలును చూపిస్తూ తన తల్లితో దిగిన చిత్రాలను రాహుల్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. మీరు వేసే ప్రతి ఓటు మీ జీవితాలను మెరుగుపరచడమే కాదు..ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుతుంది అని పేర్కొన్నారు. ఘనమైన ప్రజాస్వామ్య పండగలో తన తల్లి, తానూ భాగస్వామ్యమయ్యామన్నారు. అనంతరం ఆయన పంజాబ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమృత్‌సర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి గుర్జీత్‌ సింగ్‌ తరఫున ఆయన మాట్లాడుతూ ఈ దఫా ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరు అని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు